Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 6:46 pm Posted by : ramakrishna

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

బతుకమ్మ, నవీపేట్ : ఎలాంటి అనుమతులు లేకుండా రెంజల్ మండలం నుండి నిజామాబాద్ కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను ఆదివారం అర్ధరాత్రి నవీపేట్ పోలీసులు పట్టుకున్నారు. రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామానికి చెందిన ముజామిల్ అనే వ్యక్తికి చెందిన ఇసుక టిప్పర్ ఎలాంటి అనుమతులు లేకుండా నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో నవీపేట్ మండల కేంద్రంలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి తగు చర్యలు నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.