Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 11:28 am Posted by : ramakrishna

జుక్కల్ లో అధికార పార్టి నేతల ముంధస్తు అరెస్టు

  మంత్రి జూపల్లి అధికారిక పర్యటన

. . .  గ్రూప్ రాజకీయల ఎఫెక్ట్

 జుక్కల్, బతుకమ్మ:

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ నియోజకవర్గం పర్యటన సంధర్బంగా అధికార కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు. మంత్రి నియోజకవర్గ పర్యటనకు వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేయడం సర్వ సాధరణం. కాని అధికార పార్టికి చెందిన మంత్రి పర్యటన సంధర్బంగా సొంత పార్టీ నాయకులు కార్యకర్తలనే అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. కాంగ్రెస్ పార్టిలో గ్రూప్ రాజకీయాలు సర్వ సాధరణం. కాని ముందస్తు అరెస్టులు చేయించే స్థాయిలోఉండటం పార్టికి చెడ్డ పేరు తెస్తుంది. కామారెడ్డి జిల్లాలోనే జుక్కల్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయలు తారాస్థాయికి చెరుకున్నాయి.జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా ఏర్పడడంతో ఒక వర్గానికి చెందిన నాయకులు మరొక వర్గానికి ఇబ్బందులకు గురి చేస్తారన్న సమాచారం మేరకే ముందస్తు అరెస్టులు జరిగాయని చెబుతున్నారు.

Arrest of ruling party leaders in Jukkal

ఓక వర్గంకు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు, జుక్కల్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్  నాయకులు ఓక వర్గం గా గ్రూప్ రాజకీయాలు నడస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున స్థానిక పోలిసులు నిజాం సాగర్ మాజీ జడ్పీటిసి జయప్రదిప్,  పార్టి మండల అధ్యక్షులు సంజీవ్ పటేల్, మాజీ ఎంపిపి లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపిటిసి సురేష్, జుక్కల్ మాజీ సర్పంచ్ లు వినోద్, విఠల్ రావు,  మద్నూర్ ఎఏంసీ మాజీ చైర్మెన్ సంగమేశ్వర్ లతొ పాటు నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలిస్ స్టేషన్ లకు తరలించారు.

Arrest of ruling party leaders in Jukkal