పేకాట రాయుళ్ల అరెస్ట్

బతుకమ్మ, |జుక్కల్ : జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని కేసు చేసినట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ పేర్కొన్నారు. పక్కా సమాచారం మీదగా పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని కేసు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి దగ్గర నుండి రూ.57110, 3 బైక్స్, 7 సెల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.