దిలీప్ కొణతం అరెస్టు అక్రమం

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రజా పాలన అంటే ఇదేనా? మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం బతుకమ్మ,  హైద‌రాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి...