బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఈనెల 28న నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ముజహీద్, మజీలు కంఠేశ్వర్ చౌరస్తాలో ద్విచక్రవాహనం దొంగిలించారని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.