Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:55 pm Posted by : ramakrishna

ఆటో దొంగల అరెస్ట్

  • వాహనాలు స్వాధీనం
  • పరారీలో కీలక సూత్రదారి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాలో వాహనాలు దొంగతనాలు చేసి ఫేక్ నంబర్ ప్లేట్లతో జగిత్యాల్ జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రదారులైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక ఆటోకు స్థానిక పోలీసులు ఫైన్ వేశారు. అయితే ఫైన్ మాత్రం కామారెడ్డి జిల్లా వాసికి వచ్చింది. సదరు ఆటో యజమాని తాను ఎన్నడు జగిత్యాల్ జిల్లాలో తిరిగింది లేదు, తాను ఎలా ఫైన్ కట్టేదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ కత్రోజు నాగేంద్రచారి , సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై గోవింద్, సిబ్బంది ఆధ్వర్యంలో కేసును చేదించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. గురువారం నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సాయిచైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీసీఎస్ టీం ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఆటోనగర్ కు  చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఫాజిల్, ఆటో నగర్ కు చెందిన ఎలక్ట్రిషియన్ గా పని చేసే మహ్మద్ నవాజ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ ఆలీ, ఆలీంలతో పాటు పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్న ఆటోనగర్ కు చెందిన మహ్మద్ వాహిద్ పాషాలతో కలిసి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ముథోల్ జిల్లాలో ఆటోలో, బైక్

Arrest of auto thieves

లు దొంగతనాలకు పాల్పడినట్లు షేక్ ఫాజిల్, మహ్మద్ నవాజ్ లు సీసీఎస్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో వాటిని అమ్మిన జగిత్యాల్ జిల్లాలో, కోరుట్లలో 9 ఆటోలో, మూడు మోటార్ సైకిళ్ళను రికవరి చేశారు. ఇందులో ఫాజిల్, నవాజ్ లను అరెస్టు చేయగా షేక్ ఆలీ, ఆలీం, మహ్మద్ వాహిద్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. సంబంధిత ఆటోలో, బైక్ లను కొనుగోలు చేసిన జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం బెండపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ ల ద్వారా వాహనాలను రికవరి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4 ఆటోలో, 3 మోటార్ సైకిళ్ళ అడ్రస్ లు లభించాయని వాటిని ఆయా పోలీస్ స్టేషన్ లకు అప్పగిస్తామని సీసీఎస్ ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా దొంగతనాలు చేసిన వాహనాలను ఫేక్ నంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న మూఠాను పట్టుకోవడంలో సీసీఎస్ టీం పని తీరును నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి, సిఐలు సాయినాథ్, సురేష్, ఎస్సై నారాయణ, కానిస్టేబుళ్ళు ఉన్నారు.

Arrest of auto thieves