Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 9:50 am Posted by : ramakrishna

ఆశ వర్కర్ల అరెస్టు 

 

 

. . . చలో హైదరాబాద్ కు తరలుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు 

 

. . . పోలీస్ స్టేషన్ వద్ద ఆశల నిరసన 

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : 

 

చలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న ఆశ వర్కర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలను నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. శనివారం ఉదయం బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఆశ వర్కర్లను ఒకటొక టౌన్ పోలీస్ స్టేషన్లో 40 మంది ఆశాలను తరలించగా వారు నిరసన వ్యక్తం చేశారు. తమ పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు చలో హైదరాబాద్ లో చేపట్టారు. పోలీసులు వారిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సామరస్య పూర్వకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మండిపడ్డారు. అరెస్టు చేసిన ఆశాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లు ఉదయం నుండి పస్తుల తో ఉండడంతో వారు అనారోగ్యంకు గుర అయ్యే అవకాశం ఉందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.