Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 6:29 pm Posted by : ramakrishna

ఎన్నికల నిర్వహణకు ముందస్తూ ఏర్పాట్లు చేయాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :

 

సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బుధవారం ఆయన బోధన్ ఎ.సి.పి కార్యాలయాని పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ ని సిబ్బంది కనీస వసతులు కల్పించే విధంగా చూడాలని, ఎ.సి.పి కార్యాలయంలోని రికార్డులు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని సూచించారు.

 

Arrangements should be made in advance of the election.

సబ్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని, అలానే సంబంధిత రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని సూచించారు. సబ్ డివిజన్లోని అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహణ పాఠశాలలు, కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని, రోడ్ ప్రమాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని, యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ  కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సబ్ డివిజన్ పరిధిలని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాల ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సబ్ డివిజన్ లోని అన్నీ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ యందు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని , ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, ద్విచక్రవాహణం నడిపే సమయంలో హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎ.సి.పి. పి. శ్రీనివాస్, బోధన్ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ సి.ఐ డి. విజయ్ బాబు, రుద్రూర్ సి.ఐ ఆర్. కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Arrangements should be made in advance of the election.