Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 6:01 pm Posted by : ramakrishna

ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఏర్పాట్లను పూర్తి చేయాలి

 

. . . ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రార్థన కు ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ సూచించారు. పండగ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సోమర్ పేట్ బేస్ పక్కన ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే ఈద్గా వద్ద ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, కౌన్సిలర్లు గాదె తిరుపతి, రఫిక్, గఫర్, నాయకులు, మత్తమాల ప్రశాంత్ గౌడ్, జక్కుల సంతోష్ కుమార్, అయూబ్, తదితరులు పాల్గొన్నారు.