ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 3న నగరంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలు కానుండగా, దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది...