Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 4:06 pm Posted by : ramakrishna

పచ్చిరొట్ట ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో పచ్చిరొట్ట ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి జి.వీరస్వామి తెలిపారు. జిల్లాలో పదివేల క్వింటాళ్ల జీలుగ, 200 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఎంపిక చేయబడిన సొసైటీల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విత్తనాలను 50% సబ్సిడీపై రైతులకు అందజేస్తామన్నారు. జీలుగ విత్తనాలు కిలో ధర రూ.142.50, సబ్సిడీ రూ.71.25 పైసలు, 30 కిలోల బస్తా ధర 2137.50, జనుము విత్తనాలు కిలో ధర 125.50 పైసలు, సబ్సిడీ 62.75, 40 కిలోల బస్తా ధర 2510 రూపాయలని తెలిపారు.