బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా దేవిసింగ్ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించడం జరిగింది. మొత్తం 560 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో చీఫ్ సుపరిండెంట్లు శ్రీరామ్,రామాంజనేయులు,గంగాధర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ భోజేందర్ , చంద్రకాంత్ ,యాదయ్య ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.