హనుమాన్ దీక్షా స్వాములకు బిక్ష ఏర్పాటు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం కటికే రామ్ రాజ్ దంపతులు హనుమాన్ దీక్షాపరులకు బిక్ష ఏర్పాటు చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిక్ష దాత కుటుంబ సభ్యులు, హనుమాన్ మాలదారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.