జమ్మూకాశ్మీర్ లో ఘటన
వెబ్ న్యూస్, బతుకమ్మ : భారత ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు జమ్మూకాశ్మీర్ లో రాంబన్ వద్ద లోయలోకి పడిపోయింది. ఈఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్మీ వాహనం ’బ్యాటరీ చెష్మా‘ అనే ప్రదేశం వద్ద 600 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్ గా గుర్తించినట్లు సైన్యం తెలిపింది. పోలీస్, ఆర్మీ సహాయక చర్యలు చేపడుతుంది.