రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా...