పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి, బతుకమ్మ: ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటల్ అధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని 38 సెంటర్ లలో 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 8743 మంది, ద్వితీయ సంవత్సరం...