కేంద్ర మంత్రులను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి
హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని, కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుని ఆదివారం హైదరాబాద్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలంలో నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విమానాశ్రయ ఏర్పాటు వల్ల ఉత్తర తెలంగాణ లో పారిశ్రామిక రంగం, ఉద్యోగ రంగం, వ్యవసాయ రంగం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ...