జియో గ్రాఫికల్ ఐడేంటిఫికేషన్ రేసులో ఆర్మూర్ పసుపు
భౌగోళిక గుర్తింపు తో ఆర్మూర్ కు పేరు ప్రఖ్యాతలు పసుపునకు మరింత డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ పసుపు మరో మైలురాయిని అందుకోనుంది. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటుతో సంచలనం సృష్టించిన పసుపు.. తాజాగా భౌగోళిక గుర్తింపుకి దగ్గరలో ఉంది. పలు ప్రత్యేక వస్తువులు,ఉత్పత్తుల కోవలోకి ఆర్మూర్ ప్రాంత పసుపు పంట చేరనుంది. భౌగోళిక గుర్తింపు బరిలో ఉన్న పసుపు పంట ద్వార నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత పసుపుకి భౌగోళిక గుర్తింపు లభిస్తే మరో అరుదైన రికార్డ్ దక్కినట్లే. పసుపు బోర్డు ఏర్పాటుతో...