Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 6:14 pm Posted by : ramakrishna

ఆర్మూర్ గడ్డ-కేసీఆర్ అడ్డ

. . . బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఆర్మూర్ పట్టణాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం

 

. . .కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అటకెక్కాయి

 

. . . ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాం

 

. . .మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్షేమ పాలన, ఆయన ప్రవేశపెట్టిన ప్రజాపథకాలే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన బలమని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, కెసిఆర్ కిట్టు, అలాగే వృద్ధులకు  2 వేలు, వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ వంటి చారిత్రాత్మక పథకాలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చాయని ఆయన గుర్తు చేశారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని నమ్మకంగా నిలిచాయని, అదే నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కే ఓటు వేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరూ ఐక్యతతో పనిచేసికేసీఆర్ గారి పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపి కే.ఆర్ సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేంధర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, సంతోష్, సుజీత్ సింగ్ ఠాగూర్,సత్య ప్రకాష్, చిన్నారెడ్డి,గంగాధర్,మోయిన్ఇమ్రాన్మాలిక్ బాబాఅంజద్రహామన్షాకీర్ తదితర ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Armor Gadda-KCR Adda
Armor Gadda-KCR Adda
Armor Gadda-KCR Adda
Armor Gadda-KCR Adda
Armor Gadda-KCR Adda
Armor Gadda-KCR Adda