Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:23 pm Posted by : ramakrishna

తొర్తి గ్రామాన్ని సందర్శించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తొర్తి గ్రామ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసిన విషయం విచారణ కోసం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవ్యా మంగళవారం తొర్ది గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామానికి చెందిన మురికి కాలువ డ్రైనేజి నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి తమ పంట పొలాలకు నష్టము జరుగుతుందని రైతులు సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలో విన్నవించిన ప్రకారం రైతులు తెలిపిన పంట పొలాలను, మురికి కాలువ డ్రైనేజిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్, బాధిత రైతులు, గ్రామపెద్దలు, గ్రామస్తులతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఈ, ఎంపీఓ శివ చరణ్, ఏఈ ఇరిగేషన్, ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.