Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 7:23 pm Posted by : ramakrishna

ఉత్తమ రైతుగా అరిఫుద్దీన్

 

కోటగిరి, బతుకమ్మ :

 

పోతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామానికి చెందిన యువరైతు అరిఫుద్దీన్ మెగా రైతు మేళా లో ఉత్తమ రైతుగా ఎన్నికయ్యాడు. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. గత పది సంవత్సరాలుగా వ్యవసాయం లో నూతన పద్ధతి లను అనుసరిస్తూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. యువ రైతులను ప్రోత్సహించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేయడం సంతోషకరమని అరిఫుద్దీన్ తెలిపారు.

 

Arifuddin as the best farmer