కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం
ఒకరినొకరు తోసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు - మెండోరా. ముప్కాల్ మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ బతుకమ్మ, మెండోరా, ముప్కల్: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం రైతు వేదికలలో బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ముప్కాల్ రైతు వేదికలో చెక్కుల పంపిణీ సమయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు లక్ష చెక్కులతోపాటు...