Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 6:13 pm Posted by : ramakrishna

23 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిన అర్జెంటీనా సముద్రం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

అర్జెంటీనాలో సముద్రం 23 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో ఇది విపరీత ప్రకృతి వైపరీత్యమా,లేదంటే రానున్న ఉపద్రవానికి సంకేతమా లేక మహా ప్రళయానికి నాంది ప్రస్తావన జరుగుతుందా అన్న వ్యాఖ్యలు వాదనలు శాస్త్రీయ , సామాన్య వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. అయితే అర్జెంటీనా లోని మార్ డెల్ ప్లాటా అనే ప్రాంతంలో సముద్రం 23 కిలోమీటర్లు ఒకసారిగా వెనక్కి వెళ్ళిపోవడంతో సముద్రం మధ్యలో లంగర్ వేసిన అతి పెద్ద ఓడలు గట్టుమీద ఉన్నట్టు చిక్కిపోయాయి. అంటే ఇప్పుడు ఈ ఓడలను మళ్లీ సముద్రయానం చేయించాలంటే యధావిధిగా సముద్రం పొంగి రావాలి  అయితే ఈ పరిణామం ఇలా ఎందుకు జరిగింది అనేది సముద్రగర్భ శాస్త్రవేత్తలు దీన్ని అరుదైన ప్రకృతి పరిణామంగా భావిస్తున్నారు . సముద్ర భాగంలోకి భూమి వైపు నుంచి బలమైన గాలులు సముద్రంలోకి వీయడం సముద్రంలో ఒత్తిడి తగ్గడం, అలల జోరు బలహీనపడటం వీటన్నింటి కారణాల వల్ల భూభాగం నుంచి ఎదురొచ్చిన బలమైన గాలుల ధాటికి సముద్రం వెనక్కి వెళ్లిందని చెప్తున్నారు. అయితే ఇది తాత్కాలికమైన పరిణామం అని, కొద్ది గంటల్లోనే మళ్లీ సముద్రం ఒడ్డుకు వచ్చేసిందని కూడా చెప్పారు. అందువల్ల ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు ప్రకృతికే తెలుసు. మానవుడికి తెలియదు .. వైపరీత్యం ఉపద్రవం జరిగిన తర్వాత నిర్వచించగలమే గాని దాన్ని అంచనా వేయలేని పరిస్థితి . భారతీయ పురాణాల్లో కూడా ఇలా ఉప్పొంగుతున్న యమునా నదిలో వాసుదేవుడికి దారి ఇచ్చిందని ఉంది. ఇది కూడా అలాంటిదేమో..

Argentina's sea receded by 23 kilometers.
Argentina’s sea receded by 23 kilometers.