- ఇందూర్ లో కేంద్ర హోం మంత్రి కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అనుమతి లేదా..?
- ఎంపీ, ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకున్నది ఎవరు..?
- పార్టీ రాష్ట్ర చీఫ్ పదవిని ఆశించడంతోనే ఏడి చరీష్మాకు బ్రేక్ యత్నాలా..?
- బీజేపీలో గ్రూప్ రాజకీయం బట్ట బయలు

హైద్రాబాద్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ జాతీయ వాద సిద్ధాంతం గల పార్టీ. ఆ పార్టీలో గ్రూప్, ప్రాంత, ఒక వ్యక్తి ఆరాధన లాంటివి ఉండవు అంటారు కాషాయ పార్టీ నేతలు. కాని తన వరకు వస్తే గాని బీజేపీ కూడా ఇతర జాతీయ పార్టీలకు ఏ మాత్రపు తీసిపోని గ్రూప్ రాజకీయాలకు, ఈర్ష్య, అసూయా రాగ ద్వేషాలకు అతీతం కాదని రాష్ట్ర పార్టీలో జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే తేటతెల్లమౌతుంది. రాష్ట్ర రాజకీయాలలో తలలు పండిన నేతలు యువ నాయకత్వంను చూసి అసూయకు గురవుతుందంటే ఏమో అనుకుంటున్నప్పటికి ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జరిగిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటనలో బట్ట బయలైంది.
జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించిన రైతు మహా సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం డొల్లతనం మరోసారి బట్టబయలైంది. పసుపు బోర్డు సాధించిన నేతగా అర్వింద్ ధర్మపురి ఇమేజ్ పెరగడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ కార్యక్రమానికి అర్వింద్ స్వయంగా తన సహచర ఎంపీలందరినీ అలాగే 8 మంది పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించగా ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ రాష్ట్ర నాయకత్వం వారిని రావద్దని చెప్పినట్టు ప్రచారం జరగుతుంది. దేశంలో మోడి తరువాత ఆ స్థాయి చరీష్మ కలిగిన హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర నాయకత్వంకు సంబంధం లేకుండా ఇందూర్ కు రప్పించడాన్ని సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
బీజేపీలో అగ్రనేత, కేంద్ర హోం మంత్రి పర్యటన విషయంలో స్థానికంగా పసుపు బోర్డు సాధనకు పాటు పడిన అరవింద్ ధర్మపురి సూచనలు, సలహలు పట్టించుకోకుండా మళ్లీ వారిలో కొందరిని చాటుగా ఆహ్వానించిందట బీజేపీ నాయకత్వం. ఆదివారం నాటి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభకు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలలో అనుమానాలు , అపోహలు తలెత్తేలా వ్యవహరించిందని కార్యకర్తలు బహిరంగంగా వ్యఖ్యానిస్తున్నారు. కిసాన్ సమ్మేళనంకు నిజామాబాద్ జిల్లాకే చెందిన ఒక ఎమ్మెల్యే పేరును, ఇద్ధరు స్థానిక ఎమ్మెల్సీలను వేదికపైకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగడం విశేషం. ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంబానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అహ్వనించారు ఎంపి ధర్మపురి అరవింద్. కాని రాష్ట్ర నాయకత్వం మాత్రం సభ కు నాలుగు రోజుల ముందు వరకు చలనం లేకుండా వ్యవహరించిన తీరు పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించినట్లు తెలిసింది. పార్టీ పరంగా జన సమీకరణలో కానీ వ్యవస్థాగత ఏర్పాట్లలో గానీ ఎలాంటి సహాయాన్ని అందించకపోగా అడ్డు పుల్లలు వేసింది. తెలంగాణ రైతులు ప్రజలు పసుపు పండుగ చేసుకుంటుంటే రాష్ట్ర బీజేపీ మాత్రం ఇలా శకునిలా వ్యవహరించడం పట్ల ఇందురు బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులలో జరిగే బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టు రేసులో ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండటాన్ని కొందరు పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్టు వినికిడి. పార్టీలో స్ట్రేట్ ఫార్వర్డ్ గా జాతీయ నాయకత్వం వద్ధ పతారా కలిగిన అరవింద్ పార్టీ అదినేత పగ్గాలు దక్కితే తమ పరిస్థితి ఎమిటని కొందరు ముదురు నేతలకు భయం అని సమాచారం. పార్టీ సంస్థాగత ఎన్నికలకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాని నిజామాబాద్ షెడ్యూల్ ఖరారైన నాటి నుంచి పార్టీ నాయకత్వం అంటి ముట్టనట్టుగా ఉంది. ఇటీవల పార్టీ చీఫ్ ఎన్నికల షెడ్యూల్ రాగా దానికి కొన్ని గంటల ముందు అమీత్ షాను రప్పించి ఎంపీ అరవింద్ తన సత్తా చాటగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేస్తే పార్టీ గ్రూప్ రాజకీయాల లొల్లి ముదిరి పాకాన పడే అవకాశాలు లేకపోలేదు. మరి కొన్ని గంటలు గడిస్తే గాని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడే వారు ఎవ్వరు.. పోటీలో నిలిచేది ఎవ్వరు.. అదినాయకత్వం నాయకత్వ మార్పిడిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ ఇప్పుడే మొదలైంది.
