Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 5:03 pm Posted by : ramakrishna

నాటుతున్నారా..? నాటుతున్నట్లు చూపుతున్నారా..?

బతుకమ్మ, మోర్తాడ్:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం లో ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేస్తున్నామని, ప్రతి మొక్క వివరాలు అన్ లైన్ లో పొందుపరుస్తామని ఒక పక్క అధికారులు చెపుతున్న క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు విషయాలు తెలిశాయి. మోర్తాడ్ మండల గ్రామ శివారులో ఒక చెట్టు కింద మొక్కలు నాటకుండా పడేశారు. మరో గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కల 4 మొక్కలు నాటకుండా వదిలేశారు. గత రెండు రోజులుగా వర్షంలో మొక్కలు అలాగే ఉన్నాయి. ఒక మొక్కకు ప్రభుత్వం రూ. 5 చెల్లిస్తుంది. అదే టెకు మొక్క అనుకుంటే రూ. 8 వరకు చెల్లిస్తున్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. మొక్క లు పంపిణీ చేసిన తరువాత నటుతున్నారో లేదో తెలుసుకోకపోవడంతో రూ. లక్షల్లో ప్రజాధనం తన వృథా అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Are you planting..? Are you showing planting..?