Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:07 pm Posted by : ramakrishna

మే 1 నుంచి విలు విద్య శిక్షణ తరగతులు ప్రారంభం

 

. . . విలు విద్య శిక్షకుడు మద్దుల మురళి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మే 1 నుండి నాగారాం రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా విలు విద్య శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు విలు విద్య శిక్షకుడు మద్దుల మురళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ ని అందిస్తున్నామన్నారు. వేసవిలో విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని చదువుతో పాటు ఆటలు కూడా జీవితంలో భాగమేనని, శరీర ఉల్లాసానికి మంచి వ్యాయామం అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు దీనిపైన అవగాహన కల్పించి పిల్లలకు అవకాశం కల్పించాలని తెలిపారు.

 

Archery training classes begin from May 1st

 

విలువిద్య క్రీడాకారులు https://satgasc.telangana.gov.in లింకు ద్వారా ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోగలరని అన్నారు. మరిన్ని వివరాలకు 9848919480 నెంబర్ కి కాల్ చేయాలని కోరారు.

 

Archery training classes begin from May 1st