. . . తిరుమలాపూర్‌లో అర్చరీ సెలక్షన్స్ లో ఎంఈవో నాగేశ్వరరావు
బాన్సువాడ, బతుకమ్మ :
ఆర్చరీ క్రీడా విద్యార్థుల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, పట్టుదలను పెంపొందిస్తుందని, పట్టుదలను పెంపొందిస్తుందని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ) ఆధ్వర్యంలో ఆర్చరీ క్రీడాంశంలో జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలు తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ పోటీలను ఎస్జిఎఫ్ కన్వీనర్, మండల విద్యాశాఖ అధికారి పి. నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్జిఎఫ్ జిల్లా సెక్రటరీ ఈద శ్రీధర్, తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ సాయిగౌడ్, ఉప సర్పంచ్ ఖలీల్, ఉమ్మడి జిల్లాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీలు), వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
