Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 1:31 pm Posted by : ramakrishna

తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం

 

. . .  సమయపాలన పాటించని అధికారులు

 

. . .  పనులు కాకపోవడంతో లబోదిపో మంటున్న ప్రజలు

 

. . .  సర్టిఫికెట్ల జారీ పై పైసలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు

 

. . .  కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

 

రుద్రూర్,  బతుకమ్మ  :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం  ఉదయం 11:30 గంటల వరకు కూడా కార్యాలయానికి అధికారులు, రాకపోవడం గమనార్హం. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ఒక్కొక్కరు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్‌ కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంతో కార్యాలయ సిబ్బంది పనితీరుపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

. . . సర్టిఫికెట్ల జారీ పై పైసలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు

తహశీల్దార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్, పహాణీ మార్పులు, తదితర సర్టిఫికెట్ల జారిపై అధికారులు పైసలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

. . .  కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.