పెట్రోల్ పోసుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కామారెడ్డి లో విషాదం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేష్ చంద్ర కామరెడ్డి, బతుకమ్మ: భార్య కాపురానికి రావటంలేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జీవన్ కి ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి మోక్ష, కృతిక అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గత రెండు...