బతుకమ్మ, మాచారెడ్డి:ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా విద్యాశాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేట జెడ్పిహెచ్ఎస్ విద్యార్థినికి ప్రశంసా పత్రం లభించింది. ‘తరగని శక్తివనరులు’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విద్యార్థిని అలుగునూరి రిషిత కు ప్రశంసాపత్రం లభించింది. మండల జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. రాష్ట్రస్థాయిలో తన ప్రతిభతో పాఠశాలకు గుర్తింపు తెచ్చిన అలుగునూరి రిషితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్పర్సన్ భవాని, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.