నిజామాబాద్ నగర కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకాలు తాత్కాలికంగా నిలిపివేత

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగర కాంగ్రెస్ కమిటీ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి ఇటీవల చేపట్టిన అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో జరిగిన సంప్రదింపుల అనంతరం నగర డిసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మే 30వ తేదీన డివిజన్ అధ్యక్షుల నియామకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని డివిజన్లకు సంబంధించిన నియామకాలపై పార్టీకి ఫిర్యాదులు అందడంతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్...