Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 7:15 pm Posted by : ramakrishna

నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేత

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ఇటీవల నూతనంగా నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సభ్యులకు డి సి సి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నియామక పత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నిజామాబాద్ కార్పొరేషన్ డిసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నూతనంగా నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి కార్యవర్గ సభ్యులుగా నియమితులైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి మాత్రమే పదవులు వస్తాయని తెలిపారు. మీరు పార్టీ కోసం చేసిన కృషిని పార్టీ గుర్తించి మీకు ఈ పదవులు ఇవ్వడం జరిగిందని , ఎవరు కూడా పదవిని దుర్వినియోగం చేయకూడదని పార్టీ అభ్యున్నతి కోసం రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడానికి మీకు ఇచ్చిన పదవి సహాయంతో ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు. కార్యవర్గంలో ఉన్న ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శిలకు నిజామాబాద్ అర్బన్ లోని పలు డివిజన్లకు ఇన్చార్జులుగా నియమించడం జరుగుతుంది అని, ఎవరికి ఇన్చార్జిగా నియమించిన డివిజన్లో వారు సమయాన్ని కేటాయించి డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కమిటీలను నియమించే విధంగా చేయాలని, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు పిసిసి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఉంటుందని అందులో పాల్గొనాల్సిందిగా అందరికీ సూచించారు. ఎవరైనా పార్టీ చేస్తున్న కార్యక్రమాలలో పాల్గొనకపోతే తక్షణమే వారిని ఆ పదవి నుండి తొలగించి వేరే వారిని నియమించడం జరుగుతుందని. కావున ఎల్లప్పుడూ పార్టీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు.