నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం 61సంవత్సరాలు పైబడిన వారసులకు వీఆర్ఏలుగా ఉత్తర్వులు జారీ చేయాలని వీఆర్ఏల వారసులు కోరారు. తాము ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. జీఓ వచ్చిన నుంచి ఇప్పటి వరకు 265 మంది మరణించారని, 25మంది వారసలు మరణించారని తెలిపారు. గత 14నెలలుగా 20,555 మంది వీఆర్ఏలు చేయవలసిన విధులను 3797 మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, మానసికంగా కుంగి పోతున్నామని అన్నారు. ఇకనైనా వీఆర్ఏల వారసులకు నియామక ఉత్తర్వులను అందజేయాలని కోరారు.
