బతుకమ్మ, ఏర్గట్ల : మండలానికి జిల్లా కలెక్టర్ చే గ్రామ పాలన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు ఏర్గట్ల మండల తాసిల్దార్ మల్లయ్య తెలిపారు. బట్ట పూర్,తడపాకల్ టి సంపత్ గుమ్మిర్యాల,దోoచంద, డి గంగాధర్ తాళ్ల రాంపూర్,జి మధు తోర్తి, ఏ భూమన్న ఏర్గట్ల, మండల కేంద్రానికి ఎస్ వెంకటేష్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు మండల తాసిల్దార్ తెలిపారు. వీరు గత రెండు రోజుల క్రితమే వారికి కేటాయించిన గ్రామాలలో జి పి ఓ లుగా విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని ప్రజలకు కుల ఆదాయ నివాసము జనన మరణ వ్యవసాయ ఆదాయం ఓబిసి ఈ డబ్ల్యూ ఎస్ ఇతర ఎలాంటి ధ్రువపత్రాలు అవసరము ఉన్నచో వారి వారి గ్రామ పాలన అధికారులను కలిసి (జిపిఓ) ధ్రువీకరణ పత్రం వ్రాయించుకొని ఏర్గట్ల మండల రెవెన్యూ అధికారులను కలిసి మీయొక్క సర్టిఫికెట్ల ను పొందాలని మండల రెవెన్యూ అధికారి జే మల్లయ్య తెలిపారు.