నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పూసద్ నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్గీ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన పూసద్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.