Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 9:04 pm Posted by : ramakrishna

ఎక్సైజ్ శాఖకు ముగ్గురు అధికారుల నియామకం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఎక్సైజ్ అధికారులను నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గా శ్రీధర్ ను నియమిస్తూ గురువారం ఆదేశాలు వెలువడ్డాయి. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇంచార్జి డీసీగా వ్యవహరించిన సోమిరెడ్డిని పదోన్నతిపై ఖమ్మం డీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ కు పదోన్నతిపై నిజామాబాద్ కు బదిలీ చేశారు. రెండు రోజుల క్రితం ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఈఎస్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్ కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాల జిల్లాలో పని చేసిన నందగోపాల్ కు నిజామాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ ను నియమించారు. వరంగల్ డీపీఈవోగా పని చేసిన అరుణ్ కుమార్ కు పదోన్నతిపై ఏసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వారు గురువారం విధుల్లో చేరారు. జిల్లాకు చెందిన ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.