Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:31 pm Posted by : ramakrishna

23  నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన ఇన్ చార్జీల నియామకం

 

. . . సగానికి పైగా బీసీ నేతలకు అవకాశం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించి 23 నియోజకవర్గాల్లో ఇంచార్జిలను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీల ప్రకటనలో బీసీలకు పెద్దపీట వేశారు. 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటిస్తే అందులో 12 మంది బీసీ నేతలకు స్థానం కల్పించారు. ఐదుగురు ఎస్సీలు, ఎస్టీ నేత ఒకరికి అవకాశం కల్పించారు. ఆరు చోట్ల ఓసీ నేతలను ఇన్ చార్జీలుగా నియమించారు. ఆషాఢ మాసంలో మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల పేర్లు ప్రకటించారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఇన్ చార్జీలను ప్రకటిస్తామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇన్ చార్జీలుగా నియామకం అయిన నాయకులు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీ పాంచజన్య సిద్ధాంతాన్ని ప్రతి గడపకు చేరవేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

Appointment of Telangana Rakshana Sena in-charges in 23 constituencies.