హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు గా సీనియర్ ఐఏఎస్ లను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ కు హరికిరణ్, ఉమ్మడి కరీంనగర్ కు సర్ఫరాజ్ అహ్మద్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనిత రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాజీవ్ గాంధీ హనుమంతు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దివ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రవి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు శశాంక, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏ.శరత్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్రమోహన్, హైదరాబాద్ జిల్లాకు ఇలంబర్తి లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.