. . . ఈనెల 30న సి ఎస్ రామకృష్ణారావు పధవి విరమణ
హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఎఏస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు ప్రస్తుత సి ఎస్ రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేసిన తర్వాత చీఫ్ సెక్రెటరిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సంజయ్ జాజు కేంద్ర సర్వీసులో 13 ఎళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సంజయ్ జాజు జిల్లా కలెక్టర్ మొదలుకొని పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనను మాతృ కేడర్‌కు తిరిగి పంపించింది. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు, నిధులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజు కున్న విస్తృత అనుభవం, పరిచయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని ముఖ్యమంత్రి భావించడంతోనే నూతన చీఫ్ సెక్రటరీ గా నియామకం చేసినట్లు సమాచారం. సీఎస్ రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి సీనియర్ల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, రేవంత్ రెడ్డి మాత్రం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపారు. సంజయ్ జాజు మార్చి 2028లో పదవీ విరమణ చేయనున్నారు
