Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 4:15 pm Posted by : ramakrishna

పీఆర్టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నియామకం

బతుకమ్మ,ఏర్గట్ల: మండలానికి చెందిన పి ఆర్ టి యు సీనియర్ నాయకులు జడ్పీహెచ్ఎస్ తాళ్ల రాంపూర్ పాఠశాలకు చెందిన గటాడి భాస్కర్ ను గత కొన్ని సంవత్సరాల నుండి సంఘానికి అందించిన విశేషమైన సేవలను గుర్తించి పి ఆర్ టి యు రాష్ట్ర  అసోసియేట్ అధ్యక్షులు గా,  అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాల  నుండి కె రాజేందర్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులు గా  నియమిస్తున్నట్టు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు మోహన్ రెడ్డి,కిషన్ లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమించబడ్డ ఇరువురికి పి ఆర్ టి యు ఏర్గట్ల మండల శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉపాధ్యాయుల సమస్యలపై నిత్యం అందుబాటులో ఉంటూ, సమన్వయంతో పని చేస్తూ,సంఘాన్ని బలపరిచే విధంగా కృషి చేస్తామని పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్ రాజశేఖర్ లు తెలిపారు.