Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 9:31 pm Posted by : ramakrishna

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం

. . . బీసీ,ఎస్సీ,ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత

. . . ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ , బతుకమ్మ :

తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షులతో పాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి ,ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి సంస్థాగత పదవుల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ నియామకాల్లోనూ ఆయా కులాలతో పాటు మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. 11 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే వారిలో ఐదుగురు బీసీలు,ఇద్దరు ఎస్సీలు,ఒకరు ఎస్టీ ఉన్నారని తెలిపారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు.

. . . వివిధ విభాగాలకు నూతన భాద్యులు
ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దూగుంట్ల నరేష్ ప్రజాపతి, అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా ఇత్తరి మారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగ సంతోష్ ముదిరాజ్, తెలంగాణ జాగృతి ఎంబీసీ సంచార జాతుల విభాగం రాచమల్ల బాలక్రిష్ణ, సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్. వెంకటేష్, తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య – రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మేక లలిత యాదవ్, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా కంచర్ల శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అల్వాల జితేందర్ ప్రజాపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా రవి రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలె నిషా లెనిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచిగారి ప్రవీణ్ ముదిరాజ్, తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మునుకుంట్ల నవీన్ గౌడ్, హైదరాబాద్ జిల్లా విద్యార్థి అధ్యక్షులుగా గుమ్మడి క్రాంతి కుమార్, నిజాం కాలేజ్ అధ్యక్షులుగా వల్లకొండ అజయ్ రెడ్డి, సాహిత్య జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా కాంచనపల్లి గోవర్దన్ రాజు, రైతు జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మంథని నవీన్ రెడ్డి, తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శశిధర్ గుండెబోయిన, ఉపాధ్యక్షులుగా హరికృష్ణ బ్రహ్మాండభేరి, తెలంగాణ జాగృతి మైనారిటీ ముస్లీం విభాగం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా, తెలంగాణ జాగృతి మైనారిటీ క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జి. డేవిడ్, ఆటో జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ సలీంలు నియమించారు.

. . . తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు నియామకం
కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఎదురుగట్ల సంపత్ గౌడ్, యాదాద్రి భువనగిరికి చందుపట్ల సుజీత్ రావు, జగిత్యాల చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్, నిర్మల్ జిల్లాకు భూక్యా జానూ బాయి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ వినోద్, మేడ్చల్ మల్కాజ్ గిరి రామిడి వెంకట్ రెడ్డి, నాగర్ కర్నూల్ దారమోని గణేష్, నారాయణపేట జిల్లా గవినోళ్ల శ్రీనివాస్, సూర్యపేట జిల్లా ఎస్. క్రిష్ణవేణి, హన్మకొండ జిల్లాకు పర్లపల్లి శ్రీశైలం, భూపాలపల్లి జిల్లా మాడ హరీశ్ రెడ్డిలను నియమించారు.