Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 10:10 pm Posted by : ramakrishna

నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షుల నియామకం

 

. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షుల జాబితాను శనివారం అధికారికంగా విడుదల చేశారు.

 

Appointment of Nizamabad Corporation Division Presidents

 

నగర కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులకు పార్టీ శ్రేణులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఈ నియామకాలను స్వాగతిస్తూ, కొత్తగా ఎంపికైన నాయకులకు అభినందనలు తెలిపారు.

 

Appointment of Nizamabad Corporation Division Presidents

 

నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ సంస్థను మరింత బలపరచడంలో ఈ నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయ ని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే స్థానిక స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త కమిటీలు పనిచేయనున్నట్లు సమాచారం.

 

Appointment of Nizamabad Corporation Division Presidents