Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:26 pm Posted by : ramakrishna

న్యాయవాద సొసైటీ ఎన్నికల అధికారుల నియామాకం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల పరస్పర సహకార సొసైటీ 2026-27 ఆర్థిక సంవత్సరం నూతన డైరెక్టర్స్, కార్యవర్గం ఎన్నికకు గాను ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ నియామాక పత్రాలను వారికి అందజేశారు. ఎన్నికల నిర్వహణ విధివిధానాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని వారు తెలిపారు. సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని అందులో నలుగురు పదవికాలం ఏప్రిల్ నెలతో ముగుస్తున్నందున వాటికి ఎన్నికలు జరుగుతాయని వారు అన్నారు.