బతుకమ్మ, ఏర్గట్ల; ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ బీమ్ నగర్ కాలనీ పాఠశాల లో పనిచేస్తున్న ఇమామోద్దీన్ ని మండల పి ఆర్ టి యు కార్యదర్శిగా నియమించినట్లు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పొద్దుటూరి మోహన్ రెడ్డి, గంగోనే కిషన్ తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రం స్కూల్ ఉపాధ్యాయుడు ఇమమోద్దిన్ ను నియామకం చేసినందుకు గాను మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఇమామోద్దీన్ మాట్లాడుతూ మండల పరిధిలో పిఆర్ టియు సంఘాన్ని బలోపేతం చేయడంలో,ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం లో ముందుంటానని మండల పరిధిలోని పిఆర్ టియు తోటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.