Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 7:17 pm Posted by : ramakrishna

నలుగురు ఆర్టీఏ కమిషనర్ల నియామకం

హైదరాబాద్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కమిషనర్లుగా నలుగురిని నియమిస్తు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్లుగా పీవీ శ్రీనివాస్ రావు, అయోధ్య రెడ్డి, మొహసిన్ పర్వీన్, దేశాల భూపాల్ లను నియమిస్తున్నట్లు పేర్కొంది. వీరు మూడు సంవత్సరాల వరకు కమిషనర్ లుగా కొనసాగుతారని తెలిపింది.