గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా.మారయ్యగౌడ్ నియామకం
నిజామాబాద్, బతుకమ్మ: గోపా రాష్ర్ట ఉపాధ్యక్షులు నిజామాబాద్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.మారయ్యగౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర గౌడ్ ఆఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అదివారం హైదరాబాద్ లోని నీర కేఫ్ లో రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో గోపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న ఎస్ఎస్ఆర్ విద్య సంస్థల ఛైర్మెన్ డాక్టర్ మారయ్య గౌడ్ ను రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియామకం...