నిజామాబాద్, బతుకమ్మ:
గోపా రాష్ర్ట ఉపాధ్యక్షులు నిజామాబాద్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.మారయ్యగౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర గౌడ్ ఆఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అదివారం హైదరాబాద్ లోని నీర కేఫ్ లో రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో గోపా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న ఎస్ఎస్ఆర్ విద్య సంస్థల ఛైర్మెన్ డాక్టర్ మారయ్య గౌడ్ ను రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియామకం చేశారు. మారయ్య గౌడ్ నిజామాబాద్ జిల్లా గోపా సంఘం ను బలోపేతం చేయడానికి విశేష సేవలు అందించిన విషయాన్ని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో గుర్తు చేసి ఉపాధ్యక్షునిగా నియమించారు.మారయ్య గౌడ్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులు నియామకం పట్ల జిల్లా లోని గౌడ్ ఆఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యులు ,గౌడ యువజన సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నారు