Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 8:35 pm Posted by : ramakrishna

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

  • సిటీ ప్రెసిడెంట్లను నియమించిన ఎఐసిసి

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి ఎఐసిసి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని 30 జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పలు ప్రాంతాల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులను నియమిస్తూ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల కాలంలో తెలంగాణలో పదవుల భర్తీ కోసం సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరిట ఎఐసిసి పరిశీలకులు జిల్లాలో సమీక్షలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసిన విషయం తెల్సిందే. రిజర్వేషన్ల వారీగా అన్నీ జిల్లాల్లో, అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేస్తూ పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది. తెలంగాణలో ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక సంస్థల పోరుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసమే పార్టీ పదవులను కట్టబెట్టినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

Appointment of District Congress Presidents

Appointment of District Congress Presidents