Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 7:53 pm Posted by : ramakrishna

బీజేపీ జిల్లాల ఇంచార్జిల నియామకం

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని జిల్లాలకు బీజేపీ ఇంచార్జిలను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు ఉత్తర్వులు జారీ చేశారు. 33 జిల్లాలకు గాను హైదరాబాద్ లోని మిగిలిన ప్రాంతాలకు కూడా ఇంచార్జిలను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. స్థానికంగా కాకుండా పొరుగు జిల్లాలకు ఇంచార్జి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గోపిడి స్రవంతిరెడ్డిని నిర్మల్ జిల్లా ఇంచార్జిగా, కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణాతారను ఆదిలాబాద్ జిల్లాకు, కామారెడ్డికి చెందిన బాపురెడ్డికి జోగులాంబ గద్వాల జిల్లా, కామారెడ్డికి చెందిన రంజిత్ మోహన్ కు మహబూబ్ నగర్ బాధ్యతలు అప్పగించారు.

Appointment of BJP district in-charges