Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 8:10 pm Posted by : ramakrishna

నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ లో ఎం ఎస్ ఎఫ్ కమిటీ నియామకం

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో గల ఎస్సీ హస్టల్  మాదిగ విద్యార్థి ఫెడరేషన్  నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. మంగళవారం ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ అర్బన్ అధికార ప్రతినిధి మేకల రాజేందర్ మాదిగ సమన్వయం చేసి, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సరికేల పోశెట్టి మాదిగ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ” పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థుల సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. మంద కృష్ణ మాదిగ పేరుకే మాదిగ కులానికి చెందిన వారని కానీ ఆయన పోరాటాలు సబ్బండ కులాల కోసం చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం, పేద వర్గాలకు పెన్షన్ల కోసం, రేషన్ కోటా బియ్యం పెంపు కోసం పోరాటాలు చేయడం జరిగిందని వివరించడం జరిగింది. ఇవన్నీ పేద వర్గాల కోసం చేసిన పోరాటాలు అని వాటి ఫలితాలు కూడా సాధించామని, ఇప్పుడు ఆ ఫలితాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద అగ్రకుల సమాజం అనుభవిస్తున్నాయని తెలియజేయడం జరిగింది. ఎంఎస్ఎన్ అధ్యక్షుడిగా శివ కుమార్, ఉపాధ్యక్షులుగా అవినాష్, ప్రధాన కార్యదర్శిగా మనోజ్, కార్యదర్శులుగా  గణేష్, దీపక్, కోశాధికారిగా మణితేజ, కార్యవర్గ సభ్యులు గా వరుణ్, మణిదీప్ లను ఎన్నుకున్నారు.

Appointment of an MSF committee at the SC hostel in Namdev Wada